పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రభుత్వం వినూత్న ప్రయత్నాలను చేస్తుంది. ఇందులో భాగంగా రాజమండ్రిలో వివిధ ముఖ్య కుడళ్ళలో ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది. ఆ ఫ్లెక్సీలలో స్పీడ్ గా వెళ్ళకు బాగుంటావు, ట్రాఫిక్ రూల్ పాటించు ఇంటికి వెళ్తావు, అనే క్యాప్షన్ లతో బోర్డులు పెట్టారు. చదువుతున్న ప్రతి ఒక్కరిలో ఈ మాట ఆలోచింపచేస్తుంది. ప్రభుత్వ ప్రయత్నానికి అందరూ అభినందనలు తెలుపుతున్నారు.