కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని నారాయణఖేడ్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి అన్నారు. బుధవారం పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో ఆహార భద్రత నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీఎం రిలీఫ్ ఫండ్ , కల్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు అందించారు.