పుట్టిన బిడ్డకు ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే పట్టించాలని ఐసిడిఎస్ వాల్మీకిపురం ప్రాజెక్టు సిడిపిఓ భారతి అన్నారు. శనివారం ఐ.సి.డి.యస్. వాల్మీకిపురం ప్రాజెక్ట్ పరిధిలో వాల్మీకిపురం కుమ్మర స్ట్రీట్ అంగన్వాడి కేంద్రము నందు ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సి.డి.పి.ఒ భారతి మాట్లాడుతూ పుట్టిన గంటలోపు బిడ్డ కు వీలైనంత త్వరగా ముర్రు పాలు పట్టించాలని ఆరు నెలల వరకు కేవలం తల్లి పాలు మాత్రమే పట్టించాలన్నారు. ఆరు నెలలు పూర్తయిన తర్వాత అనుబంధాహరం మొదలు పెట్టాలన్నారు.