కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం పరిధిలోని కాశినాయన మండలం నరసాపురం గ్రామంలో ఇటీవల అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో మాబుపీరా అనే యువకుడుమృతి చెందిన విషయం తెలిసిందే.ఈ విషయం తెలుసుకున్న బద్వేల్ టిడిపి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ సోమవారం మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం ద్వారా అన్ని విధాలా ఆదుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. అంబులెన్స్ సిబ్బంది నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందినట్లు కుటుంబసభ్యులు ఆమెకు తెలిపారు. అనంతరం ఆమె ప్రాథమిక ఆరోగ్యకేంద్రాన్ని సందర్శించారు. అక్కడి వైద్యురాలితో యువ కుడి మృతి గురించి ఆరాతీశారు. జిల్లా వైద్యాధికారికి అక్కడి నుండే ఫోన్ చేసి మాట్లాడారు.