నిజాంసాగర్ ప్రాజెక్టు లో గల్లంతైన మృతదేహం లభ్యం ... సెల్ఫీ ఫోటో మోజులో ఓ నిండు ప్రాణం పోయింది. ఈ ఘటన శనివారం కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్ట్ వద్ద ఓ పర్యాటకుడు ఫోటోలు దిగుతుండగా జరిగింది. ఓ పర్యాటకుడు సెల్పీ ఫోటో దిగుతుండగా ప్రమాదవశాత్తు ప్రాజెక్టులో పడి గల్లంతయ్యాడు. ఆదివారం ఉదయం గజ ఈతగాళ్ల సహాయంతో పోలీసులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు పిట్లం మండలం ఆల్లాపూర్ గ్రామానికి చెందిన గైని పండరి (28) గా గుర్తించారు. కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.