కేంద్ర రాష్ట్రాల మంత్రులుగా పదవి బాధ్యతలు స్వీకరించిన కింజరాపు రామ్మోహన్ నాయుడు అచ్చం నాయుడు లకు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో స్థానిక తెలుగుదేశం పార్టీ శ్రేణులతో పాటు స్థానిక వాసులు ఘన స్వాగతం పలికారు. సోమవారం రాత్రి పదిన్నర గంటలకు నరసన్నపేట మండలం మడపం గ్రామం వద్ద వంశోద్ధార నది వంతెనపై వారికి ఘన స్వాగతం పలికారు.అనంతరం నరసన్నపేట పట్టణంలోకి విచ్చేసిన వారికి మందు గుండు సామాగ్రిత ఆహ్వానం పలికారు.