సరూర్నగర్ డివిజన్లోని పలు ప్రాంతాలలో కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అధికారులతో కలిసి బుధవారం మధ్యాహ్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డివిజన్లో వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని ప్రజలకు శుభ్రత ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించే ఉద్దేశంతో జిహెచ్ఎంసి ప్రత్యేక డ్రైవ్ చేపట్టినట్లు తెలిపారు. అనంతరం స్థానికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి సమస్యలు ఉన్న పరిష్కరించాలని అధికారులతో సూచించారు.