సేవా పక్వాడా పక్షోత్సవాల్లో భాగంగా రాయదుర్గం పట్టణంలోని పురాతన పాలబావిని మాజీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాపురామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో శ్రమదానం నిర్వహించి శుభ్రం చేశారు. గురువారం స్థానిక బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వచ్ఛత కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం మొక్కలు నాటారు. బిజెపి వ్యవస్థాపకులు దీన్ దయాకర్ ఉపాద్యాయ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.