నంద్యాల జిల్లా సంజామల మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను సోమవారం రెవెన్యూ, పోలీసు సిబ్బందితో కలిసి తహశీల్దార్ పి.అనిల్ కుమార్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు రికార్డులతో పాటు యూరియా గోదామును ఆయన పరిశీలించారు. యూరియాను రైతులకు అధిక ధరలకు విక్రయించినా, బ్లాక్ మార్కెట్లో అమ్మినా చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ మేరకు తహశీల్దార్ స్పష్టం చేశారు. డీటీ తులసి కృష్ణ, రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.