భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్ట పునరుద్ధరణ కోరుతూ సెప్టెంబర్ 15న విజయవాడలో లేబర్ కమిషనర్ కార్యాలయం ముట్టడి చేయనున్నట్టు కల్లూరులో కార్మిక సంఘం నగర ఉపాధ్యక్షుడు కె.సుధాకరప్ప తెలిపారు. సోమవారం కల్లూరులో మట్టి పని కార్మికుల సమావేశంలో మాట్లాడుతూ కార్మికుల హక్కులు నిలబెట్టుకునే వరకు పోరాటం కొనసాగుతుందని, అందరూ చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.