పోస్టల్ సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన పోస్టల్ ఎస్పి బి శ్రీనివాసరావు జిల్లాలో ప్రజలకు సత్వరమైన మరియు పారదర్శకమైన పోస్టల్ సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్నికి బుధవారం ఉదయం 11 గంటల సమయంలో స్తానిక మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫిస్ నందు ముఖ్య అతిథి పోస్టల్ ఎస్పి బి శ్రీనివాసరావు పాల్గొని ప్రారంభించారు. అనంతరం పోస్టల్ ఎస్పి మాట్లాడుతూ, పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సేవింగ్స్ మరియు ఇన్సూరెన్స్ లను ప్రజలకు అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు.