ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో బిజెపి ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ తల్లిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు రాహుల్ గాంధీ అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసన తెలియజేశారు. రాహుల్ గాంధీ చిత్రపటాన్ని నిప్పు పెట్టి దహనం చేశారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్ లో ప్రధాని తల్లి పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు తదితరులు పాల్గొన్నారు.