శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ రత్న ఆదేశాలతో శుక్రవారం మధ్యాహ్నం జిల్లాలోని పాఠశాలలు, కళాశాలలు, మహిళా గార్మెంట్స్లో శక్తి యాప్పై అవగాహన సదస్సులు నిర్వహించారు. ఆపద సమయంలో మహిళలు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరమని తెలిపారు. స్మార్ట్ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ యాప్ డౌన్లోడ్ చేసుకుని, SOS బటన్ నొక్కగానే పోలీసులు ఐదు నిమిషాల్లో సహాయం అందిస్తారని పోలీసులు తెలిపారు. ఈ శక్తి యాప్ ను ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.