జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు బారులుదీరారు, ఉదయం నుండి క్యూలైన్ లో గంటలకొద్ది నిరీక్షించాల్సి వస్తుంది,పంటలు చేసి యూరియా కోసం రైతులు ఎదురుచూస్తున్నా కొరత మాత్రం ప్రభుత్వం అరికట్టడం లేదు. పంటలు వేసి యూరియా చల్లాల్సిన సమయంలో యూరియా దొరకకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. సకాలంలో అందరి రైతులకు యూరియా సరఫరా చేయాలని రైతులను డిమాండ్ చేస్తున్నారు.