భారత్ పై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సామ్రాజ్యవాద విధానాలను నిరసిస్తూ శనివారం విజయనగరంలో వామపక్ష పార్టీలు నిరసన తెలియజేశాయి. ఈ సందర్భంగా అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలని, భారత్ ఎగుమతులపై విధించిన సుంకాలను రద్దు చేయాలని నినాదాలు చేశారు. భారత్ విదేశాంగ విధానంపై ట్రంప్ పెత్తనం నశించాలని, భారత్ విద్యార్ధుల వీసాలపై ఆంక్షలు ఎత్తివేయాలని కోరారు. ట్రంప్ విధానాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యతిరేకించాలన్నారు.