గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో చేపట్టే అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, పనులు జరిగే సమయంలో ఎమినిటి కార్యదర్శులు పర్యవేక్షణ చేయాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం ఆర్టీఓ ఆఫీస్ రోడ్ లో జరుగుతున్న సెంట్రల్ డివైడర్ పనులను, రెడ్డిపాలెం, గోరంట్ల, శ్రీనగర్, పట్టాభిపురం పలు ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి పనులను, ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను, రోడ్ల, డ్రైన్ల ఆక్రమణలను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.