నల్లగొండ జిల్లాలోని పరిశుభ్రతతోనే జ్వరాలను నివారించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం అన్నారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కలెక్టర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. పరిశుభ్రతతోనే టైఫాయిడ్ మలేరియా వంటి జరాలను నివారించవచ్చన్నారు. ప్రజలకు జ్వరాలు బారిన పడకుండా పరిశుభ్రతపై అవగాహన కల్పించాలని వైద్య అధికారులను ఆదేశించారు .త్రాగునీరు మల బ్యాక్టీరియా ద్వారా టైఫాయిడ్ వచ్చే అవకాశం ఉందని జిల్లాలో డెంగ్యూ తగ్గి టైఫాయిడ్ పెరుగుతుందని దీనిపై ప్రత్యేకమైన దృష్టి సారించాలని సూచించారు.