వాల్మీకిపురం తహసీల్దార్ పామిలేటి అధ్యక్షతన శుక్రవారం ఎంపీడీవో కార్యాలయంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ విధానంపై రేషన్ షాప్ డీలర్లు, సచివాలయ సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తహసిల్దార్ పామిలేటి మాట్లాడుతూ, ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి అర్హులైన కుటుంబానికి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయబోతున్నామని తెలిపారు. సచివాలయ సిబ్బంది, రేషన్ డీలర్లు మమేకమై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కార్డుల పంపిణీ విధానంపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూడాలని ఆయన పేర్కొన్నారు.