రక్తదానంతో ప్రాణాలు నిలుస్తాయి : ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ తెలిపారు.రక్తదానం చేయడం ఓ మహత్తర సేవ అని, ప్రతి ఒక్కరు రక్తదాన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని ఈగల్ ఐజీ ఆర్కే రవి కృష్ణ పిలుపునిచ్చారు. ఆదివారం నగరంలోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో గణేష్ మండపాల వద్ద స్థానిక నిర్వాహకులు నిర్వహించిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఐజీ మాట్లాడుతూ... రక్తదానం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండటమే కాకుండా, రక్తాన్ని పొందిన వారు కొత్త జీవితం పొందుతారని తెలిపారు. ఒక్కరికి ఇచ్చిన రక్తం మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందని, ఇలాంటి సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడం ప