కపాడిపాలెంలో గంజాయిని రహస్యంగా అమ్ముతున్న నలుగురిని సోమవారం సంతపేట పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితులు ఇచ్చిన సమాచారం మేరకు ఉస్మాన్ సాహెబ్ పేటకు చెందిన రామకృష్ణను అరెస్ట్ చేశారు. తమకు రామకృష్ణ గంజాయి విక్రయిస్తుంటారని నిందితులు తెలిపారు. దీంతో అతని కూడా అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు పోలీసులు తెలిపారు