బుచ్చిరెడ్డిపాలెంలోని ముంబై జాతీయ రహదారిపై ఉన్న ద్విచక్ర వాహనం కలకలం రేపింది. ఐదు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు కేఫ్ వద్ద వాహనాన్ని నిలిపివేసి వెళ్లారు. ఎక్కడైనా అసాంఘిక కార్యక్రమాలకు దీనిని వాడి ఇక్కడ పెట్టి వెళ్లారా అని కేఫ్ యజమాని ఆందోళన చెంది పోలీసులకు సమాచారమిచ్చారు. అల్లూరు మండలంలో ఓ హత్యకు ఉపయోగించిన వాహనంగా దానిని గుర్తించారు.