అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి యదుట అంబేద్కర్ అంబులెన్స్ అసోసియేషన్ సభ్యుడు మారుతి పెట్రోలు పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. అసోసియేషన్కు సంబంధించిన బోర్డును సిఐటియు నాయకులు ఎత్తుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేస్తూ అతను ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. దీంతో అక్కడ పరిస్థితి ఉధృతంగా మారింది.