తెలకపల్లి మండల పరిధిలోని రామగిరి రఘుపతిపేట రోడ్డుపై ప్రవహిస్తున్న వరద నీటిని జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు. భారీగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలకపల్లి మండలం రామగిరి రఘుపతి పేట రహదారి పై రాకపోకలను పూర్తిగా నిరోధించాలని పోలీసులను ఆదేశించారు. 24 గంటలు పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేయాలన్నారు.