Rampachodavaram, Alluri Sitharama Raju | Aug 26, 2025
రాజవొమ్మంగిలో ఎరువుల షాపు ను రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సింహాచలం మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గోడౌన్లో ఉన్న స్టాక్ను పరిశీలించారు. ఈ సీజన్లో అన్ని ఎరువులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ఎమ్మార్పీ ధరలు కంటే ఎక్కువకు అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు. రైతులకు కావలసినంత యూరియా ముందుగా ఇండెంట్ పెట్టాలని ఆదేశించారు. తహసీల్దార్ సత్యనారాయణ, సీఐ. గౌరీ శంకర్ తదితరులు పాల్గొన్నారు.