భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కారల్ మార్క్స్ కాలనీకి చెందిన సింగరేణి కార్మికుడు మంగళంపల్లి నరసింహమూర్తి పై అతని కుమారుడు కార్తీక్ ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో ఇంట్లో నిద్రిస్తుండగా కత్తెరతో దాడి చేశాడు.ఈ నేపథ్యంలో మెడకు తీవ్ర గాయాలు కాక వెంటనే నరసింహమూర్తిని కుటుంబ సభ్యులు జిల్లా కేంద్రంలోని వంద పడకల ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు, కొడుకు ఏమి పని చేయకుండా తిరుగుతున్నాడని మందలించినందుకు తండ్రిపై కార్తీక్ దాడిసినట్లు తెలుస్తుంది.