కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ గురువారం సాయంత్రం 4గంటలకు MRPS నాయకులు, కిసాన్ నగర్ డివిజన్ ప్రజలు దళిత సంఘాలతో కలిసి గాంధీ చౌక్ వద్ద రాస్తారోకో చేపట్టి ధర్నా నిర్వహించారు. వి వాంట్ జస్టిస్ అంబేద్కర్ విగ్రహాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ అంతరాయం కలిగింది పోలీసులు జోక్యం చేసుకొని.. నిరసన కారుణలో అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. ఓ సమయంలో పోలీసులకు, దళిత సంఘాల నాయకులకు తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ సందర్భంగా దళిత సంఘాల నాయకులు.. కంసాల శ్రీనివాస్, గోస్కి శంకర్ మాట్లాడారు.