ఇల్లందు నియోజకవర్గ బయ్యారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నాయిని శ్రీనివాస్ రెడ్డి పై ఆదివారం సాయంత్రం కొంతమంది సొంత పార్టీ నేతలు దాడికి పాల్పడ్డారు అని బయ్యారం పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసినట్లు బాధితులు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. అనంతరం దీనిపై డిఎస్పి తిరుపతిరావుని వివరణ కోరగా. దాడి చేసిన విషయంపై సమాచారం లేదని ఫిర్యాదు అందితే కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వారు తెలిపారు