కుందుర్పి మండలం అపిలేపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం తెలుగు భాష దినోత్సవం తో పాటు జాతీయ క్రీడా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్కూల్ కమిటీ సభ్యులు తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు తిమ్మప్ప మాట్లాడారు. తెలుగు భాష, క్రీడలు చాలా ముఖ్యమైనవన్నారు. అందరూ తెలుగు భాషను గౌరవించాలన్నారు.