తమ సమస్యలు పరిష్కారం అవుతాయని ఎంతో ఆశతో వచ్చే అర్జీదారుల సమస్యలను అర్జీదారుడు సంతృప్తిచెందేలా సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలని అన్ని శాఖల అధికారులను జిల్లా రెవెన్యూ అధికారి మలోలా ఆదేశించారు.సోమవారం ఉదయం 11 గంటల సమయంలో కలెక్టరేట్ లోని రెవెన్యూ భవన్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక పి జి ఆర్ ఎస్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ తో పాటు జడ్పీ సీఈఓ శివశంకర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఆనంద్ , తిప్పే నాయక్ , వ్యవసాయ శాఖ జె.డి. ఉమా మహేశ్వరమ్మ, పాల్గొని ప్రజల నుండి 401 ఫిర్యాదులను స్వీకరించారు.