తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో బుధవారం ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. మాజీ ఎంపీ, సూళ్లూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నెలవల సుబ్రహ్మణ్యం, నాయుడుపేట డిఎస్పి చెంచుబాబు, నాయుడుపేట సీఐ బాబి లను నాయుడుపేట వినాయక చవితి ఉత్సవ కమిటీ సభ్యులు, ఎస్ జె జువెలరీస్ అధినేత, టిడిపి నేత పోట్లపూడి రాజేష్ ఘనంగా సన్మానించారు. పట్టణంలోని దర్గా రోడ్లు నాయుడుపేట వినాయక చవితి ఉత్సవ కమిటీ వారు భారీ సినిమా సెట్టింగ్ లతో ఏర్పాటు చేసి ప్రతిష్టించిన వినాయక విగ్రహం వద్ద బుధవారం జరిగిన పూజా కార్యక్రమంలో మాజీ ఎంపీ సూళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి నెలవల