బ్రిటీష్ వారి తుపాకి గుళ్లను ఎదురించి ధైర్యంగా నిలిచిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి సేవలు చిరస్మరణీయమని సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు షేక్ జిలాని భాష పేర్కొన్నారు. శనివారం పార్టీ కార్యాలయంలో ఆంధ్రకేసరి 153వ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ – 1928లో మద్రాసులో సైమన్ కమిషన్ వ్యతిరేకంగా ‘సైమన్ గోబ్యాక్’ హర్తాల్‌లో అగ్రనాయకులు వెనక్కి తగ్గినప్పటికీ ప్రకాశం పంతులు ఒక్కడే వీరత్వంతో ముందుండి పోరాటం నడిపారని గుర్తుచేశారు. ఆ సమయంలో తుపాకీ కాల్పుల్లో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఆయన్ను అడ్డుకునే బ్రిటిష్ సైనికుల ముందు ప్రకాశం పంతులు చొక్కా విప