గణపతిని ఆరాధించే ప్రతి ఒక్కరూ మట్టి గణపతిని ఆరాధించాలని మాజీమంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మంగళవారం పిలుపునిచ్చారు. తుని మండలం తేటగుంట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విద్యార్థులు తీసుకువచ్చిన మట్టి గణపతులను ఆయన స్వీకరించారు.ఈ సందర్భంగా మట్టి గణపతి ఆరాధించి తద్వారా నిమజ్జనం చేసేటప్పుడు నీటిలో కరిగిపోతుందని రంగుల గణపతి ద్వారా నీరు కాలుష్యంగా మారుతుందని యనమల పేర్కొన్నారు