ఎదులబాద్ శ్రీ లక్ష్మీనారాయణ చెరువులో కలుషిత వ్యర్ధాలు కలవడంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు జవహర్ నగరలోని డంపింగ్ యార్డ్ నుంచి వ్యర్థ రసాయనాలు ఎరిమల్లె వాగు ద్వారా ఎదులాబాద్ లక్ష్మీనారాయణ చెరువులో కలవడంతో ఇలా జరిగిందని స్థానికులు తెలిపారు. సుమారు 10లక్షల ఆస్తి నష్టం జరిగిందని గంగపుత్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం న్యాయం చేయాలని కోరారు.