ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించడంలో భాగంగా వారానికి ఒకరోజు సైక్లింగ్ చేయాలని జిల్లా అభివృద్ధి అధికారి భూపతి రావు, రేడియాలజిస్ట్ డాక్టర్ రవీంద్రారెడ్డి అన్నారు. ఆదివారం స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కర్నూలులోని అవుట్డోర్ స్టేడియం నుంచి నిర్వహించిన ఫిట్ ఇండియా సైక్లింగ్ సండే ర్యాలీని వారు కర్నూలు ఇన్ఛార్జ్ చంద్రశేఖర్తో కలిసి ప్రారంభించారు.