ముదిరాజులు వారి హక్కుల సాధన కోసం సంఘటితం కావాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం అధ్యక్షులు జగన్మోహన్ ముదిరాజ్ అన్నారు. ఆదివారం పరిగి పట్టణ కేంద్రంలో లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ కళ్యాణమండపంలో జిల్లా అధ్యక్షురాలు స్వరూప రాణి అధ్యక్షతన ముదిరాజ్ సంఘ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు ముదిరాజుల అణచివేతకు గురిచేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిజాయితీకి మారుపేరైన ముదిరాజులను అన్ని రాజకీయ పార్టీలు చిన్నచూపు చూస్తున్నయని అన్నారు