కడప జిల్లా జమ్మలమడుగు లోని సిపిఎం పార్టీ స్థూపం వద్ద శుక్రవారం సిపిఎం నాయకుల ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం పట్టణ కార్యదర్శి ఏసుదాసు మాట్లాడుతూ కామ్రేడ్ సీతారాం ఏచూరి దూరమై అప్పుడే సంవత్సరం అయిందని తెలిపారు.ఈ దేశ రాజకీయ రంగంలో ఆయన లేని వెలితి స్పష్టంగా కనిపిస్తుందన్నారు.సీతారాం ఏచూరి జీవితం నేటి తరానికి ఆదర్శమని తెలిపారు. భూమి కోసం, భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం దేశవ్యాప్తంగా అనేక ఆందోళన పోరాటాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి అని ఆయన తెలిపారు. అణగారిన వర్గాల ప్రజల కోసం అనునిత్యం పోరాడిన గొప్ప మహనీయుడన్నారు