శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న ఓ ఇంట్లో క్యాటరింగ్ నిమిత్తం వంట నిర్వహిస్తుండగా... చిన్నపాటి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చల్లరేగడంతో నిర్వాసితులు స్థానిక అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.