జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 'శక్తి' యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు శక్తి టీమ్స్ ను ఏర్పాటు చేసామని జిల్లా SPవకుల్ జిందల్ ఆగస్టు 31న తెలిపారు. జిల్లా SP వకుల్ జిందల్ మాట్లాడుతూ రాష్ట్రంలో మహిళలపట్ల ఎటువంటి దాడులు, అఘాయిత్యాలు, వేధింపులు లేకుండా చేసేందుకుగాను ప్రత్యేకంగా ప్రభుత్వ ఆదేశాలతో 'శక్తి టీమ్స్'ను జిల్లాలో ఏర్పాటు చేసామన్నారు. ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, ముఖ్య కూడళ్ళును మఫ్టీలో సందర్శించి, మహిళలను వేధించే ఆకతాయిలను గుర్తించి, వారిపై చట్టపరమైన