జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో, పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు పర్యటించారు... ధర్మపురితో పాటు తుమ్మెనాల గ్రామాల్లోని వరి, పత్తి, పసుపు పంటలను శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు... అందులో పసుపు పంటకు కొమ్ముకుళ్ళు, అకుమచ్చ, వరి పంటలో కాండం తోలుచు పురుగులను గమనించినట్లు చెప్పారు... వాటికీ తగిన యాజమాన్య పద్దతులను రైతులకు సూచించినట్లు తెలిపారు... పంటల పరిశీలనలో పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్ర శాస్త్రవేత్తలు ఎన్.సుమలత,వై. స్వాతి, కే. రామకృష్ణ, కే. స్వాతి, ధర్మపురి వ్యవసాయ విస్తరణ అధికారి కే.నవ్యతోపాటు రైతులు ఉన్నారు..