కృష్ణా నదికి వరద ఉద్ధృతి ఇంకా తగ్గలేదని కృష్ణలంక సీఐ నాగరాజు ప్రజలను అప్రమత్తం చేశారు. నది అంచులకు వెళ్లి వినాయక నిమజ్జనం చేయవద్దని సూచించారు. అధికారులు సూచించిన ప్రాంతాల్లోనే నిమజ్జనం వేడుకలు జరుపుకోవాలని విజ్ఞప్తి చేశారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో పోలీస్ గస్తీని పెంచినట్లు ఆయన తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన స్పష్టం చేశారు.