నెల్లూరులోని సంతపేట పోలీస్ స్టేషన్ పరిధిలో సీఐ దశరథ రామారావు వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా పలు వాహనాలను ఆపి తనిఖీ చేశారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. సెల్ ఫోన్ డ్రైవింగ్ ప్రమాదకరమని, అలా చేస్తే భారీ జరిమానా విధించడం ఖాయమన్నారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయని, మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.