గూడూరు పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్ నాయుడు శనివారం విజయవాడలోని నోవాటెల్ హోటల్ లో జరిగిన సంచార జాతుల బహిరంగ సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి సమక్షంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతోపాటు బూత్ ఇన్చార్జీలు శరత్ కుమార్, దివ్యరాణి, గురు చదువన్న యాదవ్ బీజేపీలో చేరారు.