కంచిలి టౌన్ లో గల జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణలో భవిత కేంద్రం వద్ద బుధవారం సాయంత్రం నాలుగు గంటలకుసాయంత్రం నాలుగు గంటలకు జిల్లా సమగ్ర శిక్ష సహిత విద్యా విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి ఉచిత ఉపకరణములు నిర్ధారణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో ఎంవికేఎస్ రవి, ఎంఈఓ శివరాం ప్రసాద్, చిట్టిబాబు, పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.