కూకట్పల్లి పరిధిలోని సంగీత్ నగర్ లో ఐదు రోజుల క్రితం జరిగిన సహస్ర హత్య కేసు పై సమాచారం తెలుసుకోవడానికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ స్థానిక పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సహస్ర హత్య వంటి దారుణాలు పునరావృతం కాకుండా ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏ పాల్ డిమాండ్ చేశారు. సహస్ర వంటి పిల్లలు మళ్లీ బలికాకుండా సహస్ర చట్టం కోసం సుప్రీంకోర్టులో పోరాడుతామని ఆయన తెలిపారు. నిందితుడికి స్పీడ్ కోర్టులో విచారణ జరగాలని, క్రైమ్ సినిమాలు ఎపిసోడ్ల ప్రభావం సమాజంపై పడుతోందని, దీనిపై తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉందని కేఏ పాల్ అన్నారు.