అధిక యూరియా వాడకం వల్ల పంటలకు లాభం కన్నా నష్టమే ఎక్కువ కలుగుతుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి చంద్ర నాయక్ రైతులకు తెలిపారు. శనివారం ప్రొద్దుటూరులో పలు దుఖానాలను తనిఖీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అధికంగా రసాయనిక ఎరువులు వాడకం వల్ల పంటలకు మేలు కలిగించే వాన పాములు లాంటివి కనుమరుగుతున్నాయని అన్నారు.