నిర్మల్ జిల్లా త్వరలో జరుగనున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ సూచించారు. భైంసా రూరల్ పీఎస్ లో శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు. గణేష్ నిమజ్జనాలు సమయానికల్లా పూర్తి చేయాలని కోరారు. ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలన్నారు. గ్రామాల్లో అనుమానితులు సంచరిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. సీఐ నైలు, ఎస్సై శంకర్ పలువురు పాల్గొన్నారు.