ఎస్సీ, ఎస్టీలకు చెందిన ఉపాధ్యాయులకు పదోన్నతుల్లో అన్యాయం జరుగుతోందని బహుజన టీచర్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు కాంబ్లే విజయ్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై శుక్రవారం ఆదిలాబాద్లోని అంబేడ్కర్ భవన్లో ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఓపెన్ మెరిట్లో అర్హత సాధించిన ఎస్సీ, ఎస్టీలను ఓపెన్ కేటగిరీలో పదోన్నతి ఇవ్వాలని, అలాగే 'అడేక్వాసీ' నిబంధనను రద్దు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.