ప్రకాశం జిల్లా మార్కాపురం మండల పరిధిలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఎమ్మార్వో చిరంజీవి మరియు మండల వ్యవసాయ అధికారిని బుజ్జి బాయి పలు ఎరువులు పురుగుల మందుల దుకాణాలను తనిఖీ చేశారు. సంబంధిత రికార్డులను తనిఖీ చేసి అందుబాటులో ఉన్న ఎరువులను రైతులకు ఎంఆర్పి ధరలకు అమ్మాలని దుకాణదారులకు సూచించినట్లు తెలిపారు. అలాగే యూరియా కొరత కనిపించినట్లయితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు తెలిపారు.