అల్పపీడన ప్రభావంతో తిరుపతి జిల్లాలో బుధవారం పలు ప్రాంతాల్లో చిరు జల్లులతో కూడిన వర్షం పడుతుంది. దీని ప్రభావంతో వాకాడు మండలంలోని తూపిలి పాలెం బీచ్ లో అలలు ఎగసి పడుతున్నాయి. దీని ప్రభావం తో చిట్టమూరు మండలంలో భారీ వర్షం దంచికొట్టింది. సుమారు మండలంలోని ఎల్లసిరి, మన్నెమాల, కొత్తగుంట గ్రామాలలో వర్షం పడింది. వర్షంతో గ్రామంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. వినాయక చవితి నిర్వాహకులు కాస్త ఇబ్బందులు పడ్డారు. అరగంట తర్వాత వర్షం తగ్గడంతో యథావిధిగా వినాయకుడి మండపాల వద్ద పూజలు కొనసాగుతున్నాయి.