నంద్యాల జిల్లా ప్యాపిలిలో శ్రీకృష్ణుని గ్రామోత్సవం కన్నుల పండువగా నిర్వహించారు. శనివారం ఉదయం ప్రజలు, భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. ఉట్టి కొట్టే కార్యక్రమంలో చిన్నారులు పాల్గొన్నారు. సాయంత్రం వేణుగోపాల స్వామి ఉత్సవ విగ్రహాన్ని ప్రత్యేక వాహనంలో ఉంచి ఊరేగించారు. ఈ ఉత్సవంలో మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాత కోలాటం ఆడి భక్తులను ఉత్సాహపరిచారు.పిల్లలు కృష్ణుని వేషధారణలో ఆకట్టుకున్నారు.